Sunday, July 1, 2012

కన్నులపండుగ !

మావూరిదేవుడ్నిచూశారుకదండి....గుడిప్రతిష్ఠ సందర్భంగా కోలాటం పెట్టించారు.మన ప్రాచీనజానపదకళలో ఒకటైన కోలాటానికిఆదరణ తగ్గిపోయిన ఈరోజుల్లోతిరిగి ప్రాణం పోయటానికి శాయశక్తులా కృషిచేస్తున్నఆ ట్రూప్ ని చూస్తేఎంతసంతోషంకలిగిందోచెప్పలేను. గణపతినిస్తుతిస్తూ మొదలైన కోలాటం వెంకటేశుడ్నికీర్తిస్తూ, ఈశ్వరుడ్నిప్రార్థిస్తూ, సకలదేవతల్నీ ఆహ్వానిస్తూ,వరదయ్య పదాలతోపాటుమా కృష్ణయ్యను ఆటపట్టిస్తూకోలాహలంగా సాగింది.గొల్లవారివాడలకు కృష్ణమూర్తి...నీవు ఏమిపనికివచ్చినావు కృష్ణమూర్తి అంటూ ముద్దుపాపలు,పల్లెపడుచులు ఆడుతుంటే గోకులం కళ్ళముందు ఆవిష్కృతమైంది.జడకోలాటంలో భాగంగా ఆడుతూనే తాళ్ళను జడలాగాఅల్లి తిరిగి విప్పటం కన్నులపండుగే!

జాతరలకు,నవరాత్రులకు మొదలైనవాటికి సినిమాలు,మ్యూజికల్ నైట్ లు పెడుతున్న రోజుల్లో ఇలా పిలిచేవారు అరుదని...తిరుమలతిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాలకు,ఇతర పర్వదినాలలోను వీరిని ఆహ్వానించి టికెట్స్,వసతి కల్పించి స్వామివారిఊరేగింపులోపాల్గొనే అవకాశం కల్పిస్తూవుంటారని విజయలక్ష్మిఅనే కళాకారిణి చెప్పారు.కోలాటం చేసినందుకు వారేమీ ప్రతిఫలం ఆశించట్లేదు.బస్ చార్జీలు పెట్టుకొని ఆపూట ఫలహారం ఏర్పాటుచేస్తేచాలు. చుట్టుపక్కల గ్రామాలలో ఇటువంటిసందర్భాలలో ఆహ్వానిస్తే తప్పకవస్తామనిచెప్పారు.అంతేకాక ఎవరైనాకోలాటం నేర్చుకోవాలన్న ఔత్సాహికులుంటే ఉచితంగా నేర్పిస్తామని కూడా తెలియచేశారు.ఆకళాకారులకు వందనం!

ఆజనంలో నావీలును బట్టి కొన్ని ఫోటోలు తీశాను మీరూచూడండి.

గోపస్త్రీ పరివేష్టితో విజయతేగోపాలచూడామణీ....

















































































4 comments:

  1. ఈ రోజుల్లో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నిజంగా గొప్ప విషయం. జడకోలాటం చూడాలని చాలా ఆసక్తిగా వుంది.

    ReplyDelete
  2. ikkada kolatam pettalante chaalaa karchu avvuthundandi. nice, keep writing.

    ReplyDelete
  3. ఇటువంటివి చూస్తోంటే మళ్ళీ మార్పొస్తుందని ఆశ కలుగుతోందండీ!

    ReplyDelete
  4. నేను తిరుపతి లో గుడి ముందు కోలాటం చూసాను . వాళ్ళూ ఇలాగే ఎరంచు పసుపు బట్టలు వేసుకున్నారు . కోలాటం చూడటం నిజంగా కన్నుల పండుగ లాగానే వుంటుంది .

    ReplyDelete