Thursday, March 22, 2012

ఉగాది శుభాకాంక్షలతో.....


చైత్రమింకా బొట్టిపెట్టి పిలిచిందో లేదో ...
తనుమాత్రం కుహూ మంటూ వచ్చేసింది
కోయిలమ్మ !
వసంతలక్ష్మికి స్వాగత గీతిక పాడుతూ ...
దారికిరువైపులా ఎర్రగా ...
విరగబూసిన మోదుగ పూలు
రాబోయే రోజుల్లో భానుని ప్రతాపానికి
చిహ్నాల్లా కనిపిస్తున్నాయ్
పిల్లల పరీక్షల కష్టాన్ని రాబోయే
సెలవులు మరిపించినట్టు ...
పగటి వేసవి తాపాన్ని
సాయంత్రం మల్లెలు మరిపిస్తున్నాయ్
వేపపూత సౌరభాన్ని మోసుకొస్తున్న
చిరుగాలులు రాత్రిళ్ళని ...
పరిమళభరితం చేస్తున్నాయ్
కొత్త చివుళ్ళు తొడిగిన చెట్లూ ..
విరగబూసిన మల్లె పొదలూ ...
మధుమాసాన్ని మధురంగా
మార్చేస్తున్నాయ్ !
ఆరు ఋతువుల్లోనూ వసంతాన్ని
మహారాణిని చేస్తున్నాయ్!
మరి మనం కూడా ఆరు రుచుల ఉగాదిని
ఆహ్లాదభరితంగా జరుపుకుందామా
ఉగాది శుభాకాంక్షలతో.....మీ పరిమళం.

13 comments:

  1. మీకు కూడా నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. పరిమళంగారూ..

    మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు కూడా నందన నామ సంవత్సర శుభాకాంక్షలు ...

    ReplyDelete
  4. మీ కవిత చాలా బాగుంది.

    ReplyDelete
  5. వసంతలక్ష్మిని ఆహ్వానిస్తూ కోయిల పాటలా సాగిన మీ కవిత చాలా బాగుందండీ.. ఉగాది పండగ శుభాకాంక్షలు...

    ReplyDelete
  6. నందన నామ సంవత్సరంలో నందనందనుని కృపాకటాక్ష వీక్షణాలు మనందరిపైనా మిక్కిలి ప్రసరించాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  7. మీకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  8. ఎలా తెలిసిందో, ఎవరు పిలిచారో ఏమో
    మంచుతెర తొలగిందనీ..
    మావి చిగురు తొడిగిందనీ
    మత్త కోయిలలు వచ్చి వాలాయి
    శుభకర కరములు చాచి
    స్వాగతిస్తోంది శ్రీ నందన ఉగాదిని
    ఇల కోయిల
    శ్రీనిక..
    ఉగాది శుభాకాంక్షలతో..

    ReplyDelete
  9. ఆరు రుచుల 'ఉగాది 'కాహ్వాన మిచ్చి
    తెలుగు కోయిల 'పరిమళ 'పిలిచి నంత ,
    జగతి క్రొత్త చివుళ్ళు దొడిగి 'వసంత
    ఋతు 'మహారాణికి ఘన స్వాగతము పలికె

    ReplyDelete
  10. ఉగాది శుభాకాంక్షలండీ:)

    ReplyDelete
  11. మీకు కూడా belated ఉగాది శుభాకాంక్షలు..:)

    ReplyDelete