Tuesday, October 12, 2010

మరచితివా నను!!



మరచితివా ....ప్రియతమా !
మనం తలపుల తోటలో ఊగిన
వలపు ఊయలలు
వెన్నెల మడుగులో ఆడిన
తుంటరి జలకాలు
చలిరాతిరి వెలిగించుకున్న
కౌగిళ్ళ నెగళ్లు
మరచితివా ...ప్రియతమా !
కనురెప్పల ఊసులు
మరుమల్లెలపై బాసలు
ఇచ్చుకున్న మనసులు
మెచ్చుకున్న సొగసులు
నువ్వేసిన మూడుముడులు
ఆ తీపి గురుతులు ....
మరచితివా ...ప్రియతమా !
నేనలిగినవేళ నువ్వు నాన్నవై
నువ్వలసినవేళ నేను అమ్మనై
మనఒడే ఒండొరులకు తలగడై
ఆబంధమే మనఇద్దరి మనుగడై
సేదతీరిన మధుర క్షణాలను ....
మరచితివా ...ప్రియతమా ....
మరచితివా నను !!

13 comments:

  1. మనసు ఉప్పొంగుతోంది

    ReplyDelete
  2. పరిమళ గారు !ప్రాస బాగున్నది ..భావుకత బహు బాగున్నది :)

    ReplyDelete
  3. కవిత బాగుంది.
    " ఒండొరులకు " అంటే అర్థం ఏంటి?

    ReplyDelete
  4. ఒండొరులకు = ఒకరికి ఒకరు, mutually

    ReplyDelete
  5. "నేనలిగినవేళ నువ్వు నాన్నవై
    నువ్వలసినవేళ నేను అమ్మనై"

    భావనే గొప్పగా అనిపించింది..

    ReplyDelete
  6. మనసు మందాకిని-పలుకు సౌధామిని

    ReplyDelete
  7. Bagundi. mee followers list choosanu. Baapre.. chaalaa gr8 meeru. Continue your rachanaa vyasangam... Annattu Yandamoori rachanalu naakoo intereste..

    ReplyDelete
  8. "నేనలిగినవేళ నువ్వు నాన్నవై
    నువ్వలసినవేళ నేను అమ్మనై
    మనఒడే ఒండొరులకు తలగడై
    ఆబంధమే మనఇద్దరి మనుగడై"

    Awesome expression. Touching!

    ReplyDelete
  9. చాలా బాగుంది మీ కవిత .అద్భుతం. వర్ణించ టానికి భాష సరిపోదు.హేట్సాఫ్ !

    ReplyDelete